NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చింది

Uttamkumar Reddy

Uttamkumar Reddy

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి అన్ని చెరువుల నుంచి జలాశయాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో కొత్త చాప్టర్ ప్రారంభించాలని.. అది రైతులకు ప్రజలకు మేలు జరగాలని సమీక్ష చేశామని, సంవత్సరంలో ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కు నీరు అందించేందుకు కొత్త ప్రాజెక్టు చేపట్టామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. మా ప్రభుత్వ హాయంలో ప్రతి సంవత్సరం 6 నుంచి ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని, ప్రతి పదిహేను రోజులకు అధికారులతో సమీక్షించి పనులు పరిశీలన మీద చర్చ చేస్తామని ఆయన వెల్లడించారు.

  Restaurant: ఫుడ్ ఆర్డర్‌తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కి రూ. 35000 ఫైన్..

అంతేకాకుండా..’గత ప్రభుత్వం మాదిరి అధికార దుర్వినియోగం చేయం.. కమిషన్ ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టం. 36 లక్షల ఆయకట్టు ఇవ్వాలని లక్ష్యంలో ప్రభుత్వం ఉన్నాం. కేటీఆర్ భాధ్యత రహిత్యంగా కాళేశ్వరం గురించి మాట్లాడారు. ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా.. దానిని తీవ్రంగ్ ఖండిస్తున్నాం. మీ హాయంలో ప్లాన్, నిర్వహణ,నిర్మాణం లోపభూయిష్టంగా చేపట్టారు. రైతులకు వీలైనంత మేలు చేయాలని మేము చూస్తున్నాం. అర్థరహితం అయిన విధంగా సిల్లి విషయాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ పేరు మార్చుకొని.. జోసెఫ్ గోబెల్స్ రావు అని పెట్టుకుంటే బాగుండు. హిట్లర్ ను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ.. గ్లోబల్ అవాస్తవాలు చెప్పి ప్రేరేపించారు. జనం మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తుమ్మిడి హేట్టి వద్ద అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు తలపెట్టింది.. తర్వాత టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత దాని పనులు కొనసాగించారు. జాతీయ హోదా కూడా అడిగారు. ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ పనులు ఆపేసి.. 30వేల కోట్ల వ్యయం.. 85 వేల కోట్లకు వ్యయం పెంచారు. కానీ ప్రాజెక్టు ఆయకట్టు సెమ్. రిడీజైన్ లో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఐదుగురు రిటైర్డు ఇంజనీర్లతో కమిటీ వేశారు.

  Paris Olympics 2024: ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన మహిళా బాక్సర్‌ ప్రీతి పవార్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దు అని కమిటీ తేల్చింది. ఆ ప్రాజెక్టు లో సరిపోను పైసలు రావు అనుకున్నారో.. కాంగ్రెస్ కి పేరు వస్తుందని అనుకున్నారో తెలియదు. కానీ మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ ప్రారంభం నుంచే.. మూడు బ్యారేజి లనుంచి లీకేజీల ప్రారంభం అయ్యాయి. లీకేజీలు జరుగుతున్నాయి అని నీటిపారుదల శాఖ ఎల్ అండ్ టి కి లేఖ రాయడం జరిగింది. ప్రాబ్లం మొదటి నుంచీ ఉంది. మేడిగడ్డ పునాదుల నుంచే సరిగ్గా పనులు జరగలేదు.. 165 టిఎంసి ల తుమ్మిడిహేట్టి వద్ద నీళ్ళు ఉన్నా.. నీళ్ళు అక్కడ లేవు అని ప్రచారం చేసి మెడిగడ్డ కు ప్రాజెక్టు మార్చారు. కేసీఆర్,కేటీఆర్ లు వల్ల ఆస్తులు పణంగా పెట్టు ప్రాజెక్టు కట్టలేదు. అట్లా అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టిన ప్రాజెక్టు కట్టారు. తెలంగాణ మీద శాశ్వత భారం మోపారు.’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.