Kaleshwaram Project: నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో దెబ్బతిని , కుంగిపోయిన పియర్లను జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం రామగుండంలోని విశ్రాంతి గృహంలో రాత్రి బస చేయనున్నారు. కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో సమావేశమయ్యారు.
Read also: Kangana Ranaut: సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదు.. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
మే 9వ తేదీన బీఆర్‌కే భవన్‌లో నీటిపారుదల శాఖతో మరోసారి సమావేశం కానుంది. హైకోర్టు రిటైర్డ్ రిజిస్ట్రార్ మురళీధర్ ను న్యాయ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. విచారణలో సాంకేతిక సహకారం కోసం ప్రాజెక్టుకు సంబంధం లేని ఇద్దరిని తీసుకున్నట్లు సమాచారం. వీరిలో నాగర్‌కర్నూల్ సీఈ విజయభాస్కర్, పీఅండ్‌ఎం ఎస్‌ఈ శ్రీనివాస్ ఉన్నారు. మంగళవారం వరంగల్ చేరుకుని అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్తారు. మధ్యాహ్నం వరకు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం కాళేశ్వరం ఆలయంలో పూజలు నిర్వహించి, రాత్రి రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు సిద్దిపేట వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
Matangeswara Temple : సైన్స్ కు కూడా అందని అద్భుతాలు.. ఏడాదికొకసారి పెరుగుతున్న లింగం…