Site icon NTV Telugu

BJP National Executive Meeting: నగరానికి యూపీ సీఎం.. షెడ్యూల్ మార్పు..

Yogi

Yogi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేప‌థ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి భారీగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్ (HICC)కు చేరుకోనున్నారు.

Read also: Assam Floods: వరద గుప్పిట అస్సాం..173కి పెరిగిన మరణాల సంఖ్య

అయితే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకోనున్న యోగీ కొన్న కారణాల వల్ల ఆ షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే.. యూపీ‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారి రేపు (ఆదివారం) దర్శించుకుంటారని ఎమ్మెల్యే రాజసింగ్ వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాజసింగ్ పిలుపునిచ్చారు. అయితే.. మొదట కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న తర్వాతనే బయట కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. భాగ్యలక్ష్మి అమ్మవారిని రేపు యోగి దర్శించుకుంటారని, యోగి రాక కోసం పాతబస్తీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.

Exit mobile version