NTV Telugu Site icon

Kishan Reddy: వరంగల్‌కు కిషన్ రెడ్డి.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్‌లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్‌ రెడ్డి వరంగల్‌ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్‌ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు. వరంగల్ లో కొలువైన భద్రకాళి అమ్మ వారిని కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. భద్రాకాళి అమ్మవారి దర్శనం అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోడీ ప్రసంగించే సభ స్థలిని పర్యవేక్షించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బీజేపీ కార్యకర్తలకు, సభకు హాజరయ్యా ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని అధికారలును సూచించనున్నారు. కిషన్ రెడ్డి వరంగల్ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాకాళి అమ్మవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురికాకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బుధవారం చేరుకున్న విషయం తెలిసిందే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కిషన్ రెడ్డి చేరుకోగా, తెలంగాణ ఎన్నికల కమిటీ నిర్వాహక ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జులై 8న మరోసారి తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌లోని రైల్ వ్యాగన్ తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ ఎయిర్‌స్ట్రిప్ మీదుగా అక్కడికి వచ్చి భద్రకాళి దర్శనం చేసుకోనున్నారు. వర్చువల్ మోడ్ ద్వారా రైల్వే యూనిట్ ప్రారంభం కానుంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు అధికారులు పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. మరుసటి రోజు (జూలై 9) హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. మార్పులు, చేర్పులు అన్నీ పార్టీ అధిష్టానం ఆలోచించి పార్టీ ఆదేశిస్తే ఏ పని చేసినా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి గుర్తింపు వచ్చింది తెలుగు గడ్డపైనే.. ఆ విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు!