NTV Telugu Site icon

Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటే..

Kcr Kishanreddy

Kcr Kishanreddy

Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై తెలంగాణకు శాపంగా మారుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీస్ లు వ్యవహరించినట్లు ఉద్యమ సమయంలో వ్యవహరిస్తే ఈ అన్నా చెల్లెళ్ళు అమెరికా పారి పోయేవారని సంచలన వ్యాక్యలు చేశారు. కలుగులో నుండి జంతువులు అప్పుడప్పుడు బయటకు వచ్చినట్టు కేసీఆర్ అప్పుడప్పుడు బయటకు వచ్చే వారని అన్నారు. నాకు నీ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. నా రాజీనామా గురించి కేటీఆర్ అడుగుతున్నాడు. సకల జనుల సమ్మె, రైలు రోకో , మిలియన్ మార్చ్ కు రాకుండా మీ అయ్యా పారిపోయాడు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీ అబ్బా జగీర్ కాదు… కల్వకుంట్ల కుటుంబం ది కాదు… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలది అన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ మనల్ని దోచుకుందని తెలిపారు. సోనియా, కేసీఆర్ కుటుంబాలు అత్యంత సన్నిహిత కుటుంబాలు అని అన్నారు.

కాంగ్రెస్ నీ సమర్థిస్తే అది కేసీఆర్ నీ సమర్థించినట్టే అని అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో కలుస్తామని.. కేసీఆర్ కుటుంబం చెబుతుందని మండిపడ్డారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకటి అవుతాయి… తెలంగాణకు శాపంగా మారుతాయన్నారు. నా గురువు కార్యకర్తలు, ప్రజలు అన్నారు. కేసీఆర్ కి గురువు అసదుద్దీన్… అయన ఏది రాసిస్తే అది మాట్లాడుతాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రక్షణ రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం తెలిపారు. మా పార్టీ పుట్టింది… ఈ దేశం కోసమన్నారు. మీ పార్టీ నీ కుటుంబం కోసం పని చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను మనసా.. వాచా అండగా బీజేపీ ఉంటుందని అన్నారు. ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న కార్యకర్తలు చేసిన పోరాటం చూస్తే ఒళ్ళు గగురుపొడస్తుందని, అద్భుత పోరాటం చేశారని అన్నారు. ఈ పోరాటం కేసీఆర్ ప్రభుత్వంకి వ్యతిరేక పోరాటం అన్నారు.

నయా నిజాం లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. ఏ పోరాటాలతో అయితే తెలంగాణ సాధించుకున్నామో.. ఆ పోరాట సంఘాలను లేకుండా చేశారు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నీ లాంటి అవినీతి పరులను ఈ సమాజం ఎంతో మందిని చూసిందని తెలిపారు. మీ ప్రగతి భవన్ లో, ఫార్మ్ హౌస్ లో దీక్ష చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కావాలని మా కార్యకర్తలు ఏమైనా పోయారా? అని ప్రశ్నించారు. హై కోర్ట్ నిర్దేశించిన ఇందిరా పార్క్ దగ్గర పోలీస్ లకు అప్లై చేసుకుని దీక్ష చేశామన్నారు. తెలంగాణ వస్తె ఉద్యోగాలు వస్తాయని లేఖలు రాసి 12 వందల మంది అమరులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కారు కూతలు కూసే కేసీఆర్ కుటుంబం మా నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేను మిమ్మల్ని చూసుకోలేక పోతున్నామని, తల్లి దండ్రులకు లేఖలు రాసి చనిపోతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Kishan Reddy: దీక్ష విరమించిన కిషన్‌ రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాష్‌ జవదేవకర్‌