తెలంగాణలో ఈ ఏడాది విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగ్య లక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం బైక ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విమోచన దినోత్సవంలో సందర్భంగా.. కిషన్ రెడ్డి బుల్లెట్ నడిపి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళల బైక్ ర్యాలీ మొదలైన ఈబైక్ ర్యాలీ.. చార్మినార్ నుండి పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బీజేపీ శ్రేణులు.
17న హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఒకరోజు ముందే హైదరాబాద్ రానున్నారు. రేపు సాయంత్రం నగరానికి చేరుకుని శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో పాల్గొని, పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే.. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించే అవకాశం వుందని పార్టీ వర్గాల్లో టాక్. కానీ.. అధికారికంగా ఖరారు కాలేదని.. ఒక వేళ కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెల్లే క్రమమంలో.. ప్రభాస్ తో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే.. శనివారం పరేడ్ గ్రౌండ్లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు ప్రధాని మోడీ బర్త్ డే కావడంతో పార్టీ ఏర్పాటు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. విమోచన ఉత్సవాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను టీఆర్ఎస్ నేతలు చింపేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Live: Flaging-off the Women's Tiranga Bike Rally as a part of #HyderabadLiberationDay Celebrations at Bhagyalaxmi Temple, Charminar. https://t.co/b1DA4373rI
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2022