Site icon NTV Telugu

కేటీఆర్‌ ట్వీట్‌కి కిషన్‌రెడ్డి కౌంటర్

తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. “పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం” అన్న  ఒవైసీ, ఎంఐఎంతో  సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు కలిసి పొత్తుపెట్టుకోవడం వారి మాటలను సమర్దించినట్టే’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా రజాకార్ల సైన్యం హిందువులను ఇష్టానుసారంగా ఊచకోత కోసిన నిజాంను వాళ్ళు బలపరుస్తు… ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అనే ధర్మం తో ముందుకు వెళ్తున్న పీఎం ని తిడుతున్నారు అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version