Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై నేతలతో చర్చించనున్నారు. పార్టీ నేతలతో సంస్థాగత అంశాలపై అమిత్ షా చర్చించనున్నారు. పార్టీలోని వివిధ వర్గాల సీనియర్లతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఈ నెల 26న జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నికల కమిటీలను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
Read also: Rajanna Sircilla: పునుగులు తింటూ 13 నెలల చిన్నారి మృతి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. ఈ దిశగా పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలతో అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో భాజపా ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. దీంతో ఖమ్మం సభ రద్దయింది. అయితే అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. ఈ ఘట్టం అమిత్ షా పార్టీ సంస్థాగత అంశాలకే పరిమితం కానుందని సమాచారం.
Polavaram: ఏపీకి తెలంగాణ లేఖ.. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..
