బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది… ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే, ఆత్మహత్యాయత్నం తర్వాత మీడియాకు సాయి గణేష్ ఇచ్చిన బైట్ సంచలనంగా మారింది.. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు పోలీసులపై ఆరోపణలు చేశాడు సాయి.. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు.
Read Also: Pudding and Mink Pub Drugs Case: డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు..
ఇవాళ సాయి గణేష్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. సాయి గణేష్ ఇంటికి వెళ్లి.. గణేష్ అమ్మమ్మతో ఫోన్‌లో మాట్లాడించారు.. ఫోన్‌లో ఆ కుటుంబాన్ని ఓదార్చిన అమిత్‌షా.. భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. ఈ కేసులో బాధితులకు అండగా ఉంటామని అమిత్‌షా హామీ ఇచ్చినట్టు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.