Congress First List: ఉత్తమ్, మైనంపల్లి కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉదయం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రెండు టిక్కెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతికి టికెట్లు కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోదాడ నుంచి పద్మావతికి టిక్కెట్లు కేటాయించింది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ కేటాయించారు. మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్‌రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.
Also Read
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించింది. అయితే తన కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీఆర్‌ఎస్ కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు. రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల హామీ రావడంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇచ్చిన మాట ప్రకారం మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించారు.
జానారెడ్డి కుటుంబం కూడా రెండు టిక్కెట్లు ఆశించింది. జానా రెడ్డి పెద్ద కుమారుడు జయవీర్ రెడ్డికి నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. మిర్యాలగూడ నుంచి చిన్న కుమారుడు రఘువీర్‌కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే పొత్తు కారణంగా మిర్యాలగూడ సీటును సీపీఎం కోరుతోంది. మిర్యాలగూడ టిక్కెట్టు జానా రెడ్డి కుటుంబానికి కేటాయిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. గత ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్‌తో పాటు మిర్యాలగూడ టికెట్ కూడా జానారెడ్డి అడిగారు. కానీ చివరి నిమిషంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యకు టికెట్ కేటాయించింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యను పోటీకి దింపింది. దీంతో నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది.
మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం ఉదయపూర్ డిక్లరేషన్‌కు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకే కుటుంబంలో రెండో టికెట్ కేటాయింపునకు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించారు. కనీసం ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలి. అయితే గత నెలలోనే కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం చర్చకు దారితీసింది. అయితే పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను పక్కనబెట్టి టికెట్లు కేటాయించే వెసులుబాటు కూడా ఉందని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!