Site icon NTV Telugu

Vande Bharath: తెలంగాణకు మరో రెండు వందే భారత్ రైళ్లు..?

Vandy Bharath

Vandy Bharath

Two more Vande Bharat trains to Telangana: తెలంగాణకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర రైల్వే శాఖ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. అందులో తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్‌ అవున్నాయి. దీనికి ప్రజాదరణ కూడా బాగానే పెరిగింది. అందుకోసం మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కూడా ఆ రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది.

Read also: Hyderabad Traffic Restrictions: వాహనదారులు అలర్ట్‌.. మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు ఒకటి, సికింద్రాబాద్ నుంచి పూణేకు మరొకటి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వందేభారత్ రైలు కాచిగూడ-బెంగళూరు మార్గంలో ఉంటుందని సమాచారం. ఇప్పటికే రెండు నగరాల మధ్య అనేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రైలు ప్రయాణ సమయం సుమారు 12 గంటలు పడుతుంది. దీనిపై స్పందించిన రైల్వే శాఖ కేవలం ఎనిమిది గంటల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఇది ఇలా ఉండగా కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ రైళ్లను నిర్ణీత సమయం కంటే ముందుగానే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సికింద్రాబాద్ నుంచి పుణెకు మరో రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ – బుష్రాల వివాహం..ఇస్లాం విరుద్ధం

Exit mobile version