NTV Telugu Site icon

TSPSC Paper Leak: TSPSC పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Ts

Ts

TSPSC Paper Leak: TSPSC: ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు కానీ.. ఇక్కడ ఇంటి దొంగ గుట్టును రట్టు చేశారు అధికారులు. టీఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. అమ్మాయి కోసమే టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ ప్రశ్నా పత్రం లీక్ చేశారని, అది కూడా ఒక అమ్మాయికోసమని తెలియడంతో అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ప్రవీణ్‌ ను అధికారులు అదుపులో తీసుకున్నారు. ఒక అమ్మాయికోసం ప్రవీన్‌ చేసిన పనికి పరీక్షలే వాయిదా పడే పరిస్థితి రావడంతో రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

ఏం జరిగింది..

అధికారులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల తరచుగా ఓ అమ్మాయి రావడాన్ని గమనించారు. ఆమె తరుచూ వచ్చేది ప్రవీణ్‌ కోసమే అని గుర్తించారు. ఆయువతి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈనేపథ్యంలో తనకు ఎగ్జామ్‌ పేపర్‌ ఇవ్వాలని కోరింది. తను కోరిన వెంటనే తను ఏమీ ఆలోచించకుండా ఆమె కోసమే ప్రవీణ్ పేపర్‌ లీక్‌ చేసినట్టు గుర్తించారు. ఆ..యువతి కోసమే టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీ జరిగిందని అధికారులు గుర్తించారు. ఆ.. యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండటంతో ప్రవీణ్ ను ప్రశ్నా పత్రం అడిగిందని కాన్ఫిడెన్సియల్ సిస్టం క్రెడెన్సియల్స్ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ వెల్లడించాడు. దీంతో.. అడ్మినిస్ట్రేటివ్ సిస్టం పై పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి అతని సిస్టం లో లాగిన్ అయ్యారని, ఆ సిస్టం లో ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపుకున్నారు. దాన్ని ప్రవీణ్‌ ఆ అమ్మాయికి నేరుగా వాట్సప్‌కు పంపాడు.

ఇక్కడే ట్వీస్ట్‌ వచ్చింది. అమ్మాయి తమ్ముడి నీ పరీక్షకు ప్రిపేర్ చేశాక తమ్ముడి స్నేహితులకు తెలిసి డబ్బులకు పేపర్ ను అడిగారు. అప్పుడు మొత్తం 14 లక్షలు మాట్లాడుకుని …4 లక్షలు ఆమె వుంచుకుని…10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చేలా …డీల్ కుదుర్చుకున్నారు… ఆ డీల్ లో డబ్బులు ఇచ్చే దగ్గరే తేడాలు వచ్చి… ఒక యువకుడు డయల్ 100 కు కాల్ చేసి …పేపర్ లీక్ విషయం చెప్పాడు. నిందితుల్లో మహిళ భర్త కూడా వున్నాడని అధికారులు గుర్తించారు. గతం లో జరిగిన పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయ అని టీఎస్ పీ ఎస్సీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం ఒక అమ్మాయి కోసం ఓ అధికారి అయి వుండి ఇలా చేయడం సిగ్గుచేటని, ఇప్పటి వరకు మేము ప్రిపరేషన్‌ అయిన వారు ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పని పాల్పడిన ఆ అమ్మాని,తన తమ్ముడు, వారి స్నేహితులను పరీక్ష రాయకుండా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈరోజు (మార్చి 12న) నిర్వహించాల్సిన టీపీబీఓ (టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌) రాత పరీక్ష, 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ శనివారం (మార్చి 11) రాత్రి ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. హ్యాకింగ్‌పై TSPSC పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తే ఉద్దేశపూర్వకంగా లీక్ చేసినట్లు తేలింది. పేపర్ లీక్ వెనుక టీఎస్ పీఎస్సీ ఉద్యోగి హస్తం ఉన్నట్లు తేలింది.
Phalguna Masam: ఫాల్గుణ సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే గ్రహ బాధల నుండి ఉపశమనం