NTV Telugu Site icon

Hayathnagar Crime: హయత్‌నగర్ పాప మృతి కేసులో ట్విస్ట్..

Car Accident

Car Accident

Hayathnagar Crime: హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిద్రిస్తున్న చిన్నారి తలపై నుంచి కారు దూసుకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ ఉంది. కారు నడుపుతున్న హరిరామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అతనికి సీఆర్‌పీసీ 41 నోటీసు పంపింది. కానీ హరిరామకృష్ణ భార్య స్వప్న మాత్రం ఎస్సైగా పనిచేస్తున్నారు. పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హరిరామకృష్ణ అక్కడ పాప ఉందని, పట్టించుకోలేదని అంటున్నారు.

Read also: South central railway: సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్

కర్ణాటకకు చెందిన కవిత, రాజు దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గత మూడేళ్లుగా నగరంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఈ క్రమంలో హయత్‌నగర్‌లోని లెక్చరర్స్‌ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌ పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. తమతో పాటు వచ్చిన లక్ష్మి నిద్రపోవడంతో తల్లి కవిత నీడ కోసం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెట్టింది. అయితే కాసేపటి తర్వాత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే హరిరామకృష్ణ అనే వ్యక్తి తన కారు పార్క్ చేసేందుకు సెల్లార్‌లోకి వచ్చాడు. తనకు కేటాయించిన స్థలంలో పాప పడి ఉండటాన్ని గమనించని రామకృష్ణ కారును ముందుకు తీసుకొచ్చాడు. మొదటి టైర్ పాప తలపై నుంచి పోయింది. అయితే వెంటనే కారును వెనక్కి తీసుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన తల్లి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Jeedimetla CI: వివాహిత కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన జీడిమెట్ల సీఐ