Thummala Nageswara Rao: రానున్న రోజుల్లో వైరా ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎంపి అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. కొంతమంది చేతగాని విమర్శలు చేస్తున్నారు.. కష్టాలు ఉన్న, అప్పులు ఉన్న,పరిపాలన విచ్ఛిన్నం అయిన దాన్ని సరిదిద్ది అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని తెలిపారు. రైతుల్లో చిరునవ్వు చూసేందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్న రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.
Read also: Ponnam Prabhakar: పదేళ్లలో హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం..
రానున్న రోజుల్లో వైరా ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని తెలిపారు. వేంసూరు మండలం లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. గోదావరి నీళ్లు తప్ప ఏ పదవులు నాకు ముఖ్యం కాదన్నారు. వారందరినీ మరిపించే విధంగా శ్రీరాముడి దయతో అభివృద్ధి చేసే అవకాశం కలిగిందన్నారు. అతి చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళను,నష్టం చేసే వాళ్ళను గుర్తించి మంచివాళ్లను కలుపుకోవాలన్నారు. సమన్వయంతో వచ్చే వాళ్ళను చేర్చుకోవాలే తప్ప స్వార్థం కోసం, దుర్బుద్ధితో వచ్చే వాళ్ళు మనకు అక్కర్లేదన్నారు. స్థానిక ఎంఎల్ఏ కు తెలియకుండా ఏ పనిలో జోక్యం చేసుకోను.. తుది నిర్ణయం ఎమ్మెల్యే దే అన్నారు.
వేసవిలో శరీరానికి కావాల్సిన ఎనర్జీనిచ్చే ఆరెంజ్ జ్యూస్