NTV Telugu Site icon

Tummala Nageswara Rao: 40 ఏళ్లుగా రాజకీయాల్లో నిబద్ధతతో ఉన్నా..

Thumala

Thumala

రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.. పార్టీ అభివృద్ధి కోసం పెద్ద నాయకులతో కలిసి పని చేస్తాను అని తుమ్మల అన్నారు. భట్టి విక్రమార్క ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తాం అని ఆయన అన్నారు. మూణ్ణేళ్ల గ్యారెంటీ కార్డు భద్ర పర్చుకోండి అని సూచించారు.

Read Also: Nara Bhuvaneshwari: టీడీపీ ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలు.. వీడియో రిలీజ్‌ చేసిన భువనేశ్వరి

మీలాగా మేము దోచుకోమ్.. ఎలా పరిపాలించాలో ఆ అనుభవాలు, మేధో సంపత్తి మా పార్టీ సొంతం అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీ లాగా దొంగ హామీలు ఇవ్వం.. మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అబద్ధపు హామీలివ్వం.. మేము ఆగం అవుతున్నామని అంటున్నారు.. మీరు ఆగమవుతున్నారు మా పని విధానం చూసి.. మీరు అక్రమంగా అమ్మిన భూములు, ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేసినవన్ని వెనక్కు తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీర్మానం చేశారు.. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలి.. చీమ చిటుక్కుమన్నా మేం వస్తాం అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మేం అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.