Site icon NTV Telugu

Tummala Nageswara Rao : మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జైత్రయాత్రే..

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అసాధ్యమని భావించిన ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టం చేశారు. కేవలం అసూయతోనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వారిని ఎప్పుడో తిరస్కరించారని ఆయన ఎద్దేవా చేశారు.

Nuclear Deal: అణు యుద్ధం వస్తుంది..!? అగ్రదేశాల డీల్‌ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలను మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకునే నేడు కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కులగణన చేపట్టబోతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ (A, B, C, D) విషయంలో దశాబ్దాల నాటి కల సాకారం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 13,000 కోట్లు వెచ్చించి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన వెల్లడించారు.

గత పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారే నేడు నీతులు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. “రైతాంగం, పేదలు, నిరుద్యోగులు సంతోషంగా ఉంటే ఓర్వలేక ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ , పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం చేశారు, కానీ ప్రజలు తమ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించి వారికి బుద్ధి చెప్పారు” అని తుమ్మల గుర్తు చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రజలు సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకరించకపోయినప్పటికీ, అవసరమైతే తల తాకట్టు పెట్టయినా సరే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. తాము చేసే పనులే తమకు రక్షణ అని, కాంగ్రెస్ పార్టీ ఎవరి విమర్శలకూ బెదరదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

Blood Fall: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!

Exit mobile version