ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలువకు పూజలు చేసి పుష్పాభిషేకం చేశారు.. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి ప్రజానికం దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నారు.. దేవుడు లాంటి ఎన్టీఆర్ వల్ల వేంసూరు మండలంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు.
Read Also: Nirmala Sitharaman: ఏపీకి కేటాయింపుల్లో ప్రధానికి రెండో ఆలోచనే ఉండదు..!
ఇక, అసంపూర్తిగా ఉన్న కాలువ సీఎం కేసీఆర్ పాలనలో పూర్తిచేశాం అని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు.. తన జీవిత ఆశయం సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని.. సత్తుపల్లి మాదిరి పాలేరును కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. పాలేరులో సాగు నీటి కష్టాలు తీరాయి, జాతీయ రహదారులతో భూముల రేట్లు పెరిగాయన్న ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కొనసాగడం కోసం మీ దీవెనలతో, భద్రాద్రి రాముడి ఆశీస్సులతో చివరి శ్వాస వరకు నిలబడతా.. సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక, రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అంతకు ముందు సత్తుపల్లి పట్టణం నుండి లింగపాలేం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగపాలేం నుండి తుమ్మల బుల్లెట్ నడిపి తన అభిమానులను ఉత్సహపరిచారు.. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుండి ఎన్టీఆర్, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.