ఖమ్మం జిల్లాగా పాలేరు నియోజకవర్గాన్ని చూశానన్నారు టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. కులమతాలకు, పార్టీల అతీతంగా అభివృద్ధికి కృషి చేశానన్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొంది మీ నియోజకవర్గం లోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశా అన్నారు తుమ్మల.
ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలను అభివృద్ధి చేశానన్నారు. నలభై సంవత్సరాలుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశానని రాజకీయం కోసం నేను రాజకీయం చేయలేదన్నారు. నియోజకవర్గంలో అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేశానన్నారు.
Read Also MP Keshavrao : మోడీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ ఫైర్..
నియోజకవర్గ అభివృద్ధితో భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. గ్రామాల్లో సమస్యల కోసం నా దగ్గరకు రానివ్వడం లేదు. ప్రజాసమస్యలు నా చెవికి వినబడితే చాలు అవి పూర్తి చేసే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడన్నారు. ప్రజల కోరికతో పార్టీ నిర్ణయంతో మళ్లీ మీ ముందుకొస్తా భవిష్యత్ లో కూడా మళ్లీ మీ ముందుకువస్తా అని కామెంట్లు చేశారు తుమ్మల.
