NTV Telugu Site icon

Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి.. మీడియాపై తుల ఉమ ఫైర్

Tula Uma

Tula Uma

Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి మీడియాపై బీజేపీ నాయకురాలు తుల ఉమ ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో తుల ఉమ మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ లోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయకండని అన్నారు. కొంత మంది నేను బీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని మండిపడ్డారు. మీడియాలో వచ్చిన కథనాలు తప్పు, నమ్మకండి ప్రజలారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ కి వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, వారి నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాను, నా ఒక్క దాని కోసం నిర్ణయం తీసుకోను అని తుల ఉమ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలనే బదనాం చేస్తున్నారని అన్నారు. పార్టీల వారు రమ్మని అడిగారు అంతే..అని తెలిపారు. నేను ఇప్పటికే చాలా నష్టపోయాను, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం అందరికీ ఉపయోగ పడే విధంగా ఉంటుందని తుల ఉమ అన్నారు. భవిష్యత్ లో నేను రాజకీయాల్లో కీలకంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

నిన్న తుల ఉమ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీసీ లను అణగదొక్కాలని చూస్తున్నారు, అగ్రవర్గాలకు కొమ్ము కాస్తున్నరని మండిపడ్డారు. బీజెపీలో మహిళను స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా చిన్న తనం నుంచే దొరలతో కొట్లాడుతున్న అని తెలిపారు. బీఆర్ఎస్ లో కూడా ఓ దొర అహంకారంతో బయటకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలని అనుకున్న అని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకి వ్యతి రేకం అన్నారు కానీ.. దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చాడు ఎంపి బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేను అని తెలిపారు. నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. బీజెపీలో సిద్దాంతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో నే ప్రకటిస్తనని అన్నారు. బీజెపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకమని మండిపడ్డారు. దొరలు కావాలనే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
Bigg Boss7 Telugu : బిగ్ బాస్ లో భోలే షావలి ఐదు వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Show comments