NTV Telugu Site icon

Tula Uma: బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా.. తుల ఉమ సీరియస్ వార్నింగ్..

Tulauma Bandi Sanjay

Tulauma Bandi Sanjay

Tula Uma: తెలంగాణలో సీట్ల పంపకాలపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చివరి క్షణంలో బీఫారం రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీని వీడాలని యోచనలో వున్నారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అని తుల ఉమ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుల ఉమ తన అనుచరులతో సమావేశంలో మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ లను అణగదొక్కాలని చూస్తున్నారు, అగ్రవర్గాలకు కొమ్ము కాస్తున్నరని మండిపడ్డారు. బీజెపీలో మహిళను స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా చిన్న తనం నుంచే దొరలతో కొట్లాడుతున్న అని తెలిపారు. బీఆర్ఎస్ లో కూడా ఓ దొర అహంకారంతో బయటకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలని అనుకున్న అని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకి వ్యతి రేకం అన్నారు కానీ.. దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చాడు ఎంపి బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేను అని తెలిపారు. నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. బీజెపీలో సిద్దాంతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో నే ప్రకటిస్తనని అన్నారు. బీజెపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకమని మండిపడ్డారు. దొరలు కావాలనే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
Tula Uma: తుల ఉమకు నిరాశ.. పార్టీ వీడే యోచన!

Show comments