తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలడం ఖాయం అయిపోయింది. గతంలోనే టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగినా.. ఆయన ఆ వార్తలను ఖండించారు.. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం.. రమణ.. కారు ఎక్కడమే మిగిలిందంటున్నారు.. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ.. ఇవాళ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు ఎల్ రమణ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయన.. కేసీఆర్‌తో చర్చలు జరిపారు.. ఇక, ఇప్పటికే ఎర్రబెల్లితో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు ఎల్. రమణ.. ఈ భేటీలో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి రమణ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. అయితే, తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలతో క్రమంగా తెలుగు దేశం పార్టీ బలహీనపడుతూ వచ్చింది.. దీంతో.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. ఈ విషయంపై పార్టీ కార్యకర్తలతో కూడా ఎల్.రమణ చర్చించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్‌ను కలిసిన ఎల్.రమణ.. టీఆర్ఎస్ గూటికి టి.టీడీపీ చీఫ్..!

Ramana