Site icon NTV Telugu

TSRTC: రికార్డు బద్దలు కొట్టిన టీఎస్‌ ఆర్టీసీ.. ఆ ఒక్క రోజే రూ. 12 కోట్ల ఆదాయం

Tsrtc

Tsrtc

TSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండుగకు సౌంతుళ్లకు వెళ్లారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఈసారి చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జారీ చేసిన జీరో టిక్కెట్లు 9 కోట్లు దాటాయి.

Read also: Kishan Reddy: హైదరాబాద్ లో వికసిత్ భారత్ కార్యక్రమం.. నేడు కిషన్‌ రెడ్డి షెడ్యూల్..

ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, ఈ నెల 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పండుగ సమయంలో మహిళల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని ఆర్టీసీ అంచనా వేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12, 13 తేదీల్లో 4,400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులను నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ ముగియడంతో ప్రయాణికులు నగరానికి తిరుగు ప్రయాణమవుతున్నారు.
Kishan Reddy: హైదరాబాద్ లో వికసిత్ భారత్ కార్యక్రమం.. నేడు కిషన్‌ రెడ్డి షెడ్యూల్..

Exit mobile version