Site icon NTV Telugu

TSRTC: త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు.. తీరనున్న సీట్ల కొరత..

Tsrtc

Tsrtc

TSRTC: తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజుకు 12 లక్షల మంది మహిళలు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత… ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరింది. బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గతంలో 4.50 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు వారి సంఖ్య రెట్టింపు అయింది. పురుషులే కాదు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు కూడా బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.

Read also: Real Estate Frauds: రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. ఇక నుంచి అలాంటివి చేస్తే జైలుకే..!

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. నగరంలో త్వరలో 500 ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల మార్చి నుంచి కొన్ని బస్సుల రాకపోకలు ప్రారంభమవుతాయని గ్రేటర్ జోన్ అధికారులు వెల్లడిస్తున్నారు. జూన్, జూలై నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తామని చెప్పారు. నగర ప్రయాణికులకు మెట్రో తప్పితే ఏసీ ప్రయాణం స్వర్గంగా మారింది. సిటీ బస్సుల్లో ఏసీ లేదు, సీటు కూడా దొరకదు. త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులతో ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు. ఈ బస్సుల్లో ప్రయాణికులు సీట్లు పొందే అవకాశం ఉంది. పాస్ తీసుకున్న విద్యార్థులకు, జనరల్ పాస్ తీసుకున్న వారికి కూడా ఈ బస్సులను కేటాయించే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అందుబాటులోకి వస్తే.. కొన్ని కాలేజీలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
Masth Shades Unnai Ra: మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా నుంచి ఆకట్టుకుంటున్న ‘హలో అమ్మాయి’ సాంగ్..

Exit mobile version