TSRTC special Offer for rakhi festival: శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండగ కోసం అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను అందజేస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్‌ను అమలులోకి తెచ్చింది. కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించే అవకాశం కల్పిస్తోంది. దూర ప్రాంతాల్లో ఉండే ఆడపడుచులు తమ అన్నదమ్ములకు స్వయంగా వెళ్లి రాఖీలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఆఎస్ఆర్టీసీ సూచిస్తోంది. ఈ మేరకు కార్గో, పార్శిల్ సర్వీసులను హైదరాబాద్, సికింద్రాబాద్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
మీ సోదరులకు రాఖీ పంపించడానికి #TSRTCCargo ని సంప్రదించండి.
ఈ సారి పండుగ మరింత సంతోషంతో చేసుకుందాం…#TSRTC తో
@TSRTCHQ @Govardhan_MLA #RakshaBandhan #RakshaWithTSRTC pic.twitter.com/Mj1pg1zap5
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 31, 2022
Read Also: Cinema Functions: అభిమానుల ప్రాణాలు తీస్తున్న సినిమా ఫంక్షన్లు
మరోవైపు టీఎస్ఆర్టీసీ అన్ని బస్సులకు బస్సు ట్రాకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్ పేరిట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక యాప్ తయారు చేయించారు. ఈ యాప్‌ను తాజాగా ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. దీని ద్వారా బస్సులు గమ్యస్థానాలకు చేరుకునే సమయాన్ని తెలుసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా140 బస్సుల్లో ఈ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వివిధ రూట్లలో 100 సుదూర బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నం వంటి రూట్లలో నడుస్తున్న డిపోలను ప్రస్తుతం ట్రాక్ చేస్తున్నట్లు వివరించారు. TSRTC బస్ ట్రాకింగ్ యాప్‌ను TSRTC అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov .inలో నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
