Site icon NTV Telugu

TSRTC Bus Tickets: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టీ-24 టికెట్లలో భారీ డిస్కౌంట్..!

Tsrtc Bus Tickets

Tsrtc Bus Tickets

TSRTC Bus Tickets: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టిక్కెట్లపై భారీ తగ్గింపును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక.. హైదరాబాద్ నగరంలో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణానికి టీ-24 టికెట్ రూ.లకే ఇవ్వాలని నిర్ణయించారు. 75.. అదే T-24 టిక్కెట్టు పిల్లలకు కేవలం రూ. 50. అయితే, ఈ తగ్గింపులు ఆగస్టు పదిహేనవ తేదీన మాత్రమే చెల్లుబాటు అవుతాయని TSRTC యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం టి-24 టిక్కెట్టు సాధారణ ప్రయాణికులకు రూ.120, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉంది. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందిస్తున్న రాయితీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్‌టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

Read also: Traffic Diversions: పంద్రాగస్టు రోజున ట్రాఫిక్ ఆంక్షలు.. గోల్కొండకు వెళ్లే వారికి సూచనలు..

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని, 60 ఏళ్లు పైబడిన మహిళ, పురుష సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు వయస్సు నిర్ధారణ కోసం వారు తమ ఆధార్ కార్డును బస్సు కండక్టర్‌కు చూపించాలి. .అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రయాణిస్తున్నారు.పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఆ రోజు పర్యాటక ప్రాంతాలు, పార్కులు బాగా రద్దీగా ఉంటాయి.ఈ నేపథ్యంలోనే సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. T-24 టికెట్.. పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.50 టిక్కెట్టు ఇస్తున్నారు.ఈ డిస్కౌంట్లు ఈ నెల 15వ తేదీన ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ప్రజలు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి నగరంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 3 గంటల పాటు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు ఉండవు

Exit mobile version