Site icon NTV Telugu

TSRTC:ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్… 5రూ.ల‌కే బ‌స్సు ప్రయాణం!

Tsrtc

Tsrtc

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. నిత్యం వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది.

రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులు ఒక బస్టాపు నుంచి మరో బస్టాపు వరకు వెళ్లవచ్చు. కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడక దారిలో అవస్థల పాలవుతున్నారు.

ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అయితే.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌, ధరలతో భారంగా వాహనాలు నడుపుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాల ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు డ్రైవర్ల యూనియన్‌ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నిన్న‌ అర్థరాత్రి నుంచి ఆటోలో, క్యాబ్‌ల బంద్‌ దృష్ట్యా.. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ పేర్కొంది. అంతేకాకుండా మరిన్ని వివరాలకు.. 9959226160, 9959226154 నెంబర్లలో సంప్రదించవచ్చునని ప్రకటించిన విషయం తెలిసిందే..

Kushi: విజయ్, సమంతల మధ్య అదర చుంబనం..?

Exit mobile version