NTV Telugu Site icon

Siddipet:మాన‌వ‌త్వం చాటుకున్న బ‌స్ డిపో మెకానిక్.. సూపర్ వైజర్

Bus Cash

Bus Cash

సిద్దిపేట జిల్లా బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ మానవత్వం చాటుకున్నాడు. నిన్న రాత్రి మిడిదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన నాగరాజు సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో బ్యాగు మర్చిపోయాడు. దీంతో బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ ఆబ్యాగ్ ను చూసాడు. ఆబ్యాగ్ లో ఏముందో అని ప‌రీక్షించాడు. బ్యాగ్ లో రూ. 50వేలు వుండడంతో ఖంగుతిన్నాడు. ఎవ‌రో మ‌ర్చిపోయార‌ని, బ్యాగును య‌జ‌మానికి తిరిగి ఇవ్వాల‌ని అనుకున్నాడు. కానీ..బ్యాగ్ య‌జ‌మాని అడ్ర‌స్ ఎలా పట్టుకోవ‌డం అని ప్ర‌శ్నించుకున్నాడు. బ్యాగ్ లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని వెతికాడు. చివ‌రికి అత‌నికి బ్యాగ్ య‌జ‌మాని ఆధార్ కార్డ్ వుండ‌టంతో అందులోని అడ్ర‌స్ ఆధారంగా స‌మాచారం అందించాడు.

అప్ప‌టికే బ్యాగ్‌ మిస్ అయ్యింద‌నే బాధ‌తో కుంగిపోతున్న బ్యాగ్ య‌జ‌మాని నాగరాజుకు స‌మాచారం అందింది. మీ బ్యాగ్ మాదగ్గ‌ర వుంది. మీరు వ‌చ్చి తీసుకెళ్ళండి అంటూ స‌మాచారం రాగానే.. నాగ‌రాజుకు ప్రాణం లేచి వ‌చ్చినట్టు అయ్యింది. ఎక్క‌డికి రావాల‌ని అడుగ‌గా.. సిద్దిపేట జిల్లా బస్ డిపో రావాల‌ని ర‌వీంద‌ర్ తెలిపాడు. దీంతో నాగ‌రాజు హుటాహుటిని సిద్దిపేట జిల్లా బస్ డిపోకు ప‌రుగులు పెట్టాడు. బ్యాగ్ య‌జ‌మాని నాగరాజు రాగానే వివ‌రాలు సేక‌రించి అధికారుల సమక్షంలో రూ. 50 వేలు బ్యాగ్ ను అందించాడు ర‌వీంద‌ర్. దీంతో నాగ‌రాజు ఊపిరి పీల్చుకున్నాడు. త‌న‌కు బ్యాగ్ అందించి, మానవత్వం చాటుకున్న సిద్దిపేట జిల్లా బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ ప్ర‌సంస‌ల‌తో ముంచెత్తాడు.

HIT Movie: జూలైలో రాబోతున్న బాలీవుడ్ ‘హిట్’ మూవీ

Show comments