Site icon NTV Telugu

Bajireddy: బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. కొట్టడమే కరెక్ట్..!

తెలంగాణలో టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. ఇక, కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్‌ శ్రేణులు అడ్డుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి.. కొన్ని సార్లు, దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అయితే, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్న ఆయన.. ఎదురు తిరగండి, ఎక్కడిక్కడ అడ్డుకోండి అంటూ టీఆర్ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read Also: High Court: రైతు బీమాపై పిటిషన్.. ప్రభుత్వానికి ఆదేశాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడమే కరెక్ట్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాజిరెడ్డి… ఇక, ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్న ఆయన.. ఆర్మూర్‌లో దాడి మంచిదే నంటూ సమర్థించారు.. అసలు గన్నరంలోనే జరగాల్సింది.. ఆర్మూర్‌లో జరిగింది అంటూ చెప్పుకొచ్చిన ఆయన… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. కాగా, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. సందర్భాన్ని బట్టి.. రాష్ట్ర బీజేపీ నేతలను కూడా టార్గెట్‌ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు బాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Exit mobile version