NTV Telugu Site icon

TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు.. నేడు హైకోర్టు తీర్పు

Tspsc

Tspsc

TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నేడు హైకోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.

Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో ఓ వైపు సిట్‌, మరోవైపు ఈడీలు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. వారి ద్వారా అందులో భాగమైన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న వాదనలు జరిగాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. 24న జరిగిన వాదనల్లో.. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తూ.. సీబీఐకి ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కోణాల్లో దర్యాప్తు చేసే సత్తా సిట్‌కు లేదన్నారు. అయితే… పిటిషనర్ల వాదనతో ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకీభవించలేదు. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతోందని, సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీల్డ్ కవర్‌లో సిట్ సమర్పించిన నివేదికతో పాటు ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..

Show comments