Site icon NTV Telugu

TSICET : దరఖాస్తు గడువు జులై 4 వరకు పొడిగింపు

Ts Icet 2022

Ts Icet 2022

తెలంగాణలోని విద్యార్థులుకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఈ రోజు ముగియనున్న టెస్‌ ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్ రిజిస్ట్రేషన్, సమర్పణకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా టీఎస్‌ ఐసెట్‌ కోసం చివరి తేదీ ముందుగా 27 జూన్, 2022 వరకు షెడ్యూల్ చేయబడింది.

అయితే.. దరఖాస్తుదారులపై ఆలస్య రుసుమును విధించవద్దని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) హైదరాబాద్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదు, సమర్పణ చివరి తేదీ ఆలస్య రుసుము లేకుండా 04 జూలై 2022 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

Exit mobile version