NTV Telugu Site icon

TSES Recruitment 2023: ఏకలవ్య పాఠశాలల్లో ఉద్యోగాలు.. 30 వేల కంటే ఎక్కువ జీతం..!

Tses Recruitment 2023

Tses Recruitment 2023

TSES Recruitment 2023: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో CBSE సిలబస్‌ను బోధించవలసి ఉంటుంది. షేరింగ్ ప్రాతిపదికన పాఠశాల క్యాంపస్‌లో బోర్డింగ్ మరియు బస సౌకర్యాలు అందుబాటులో ఉంచబడ్డాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2023లోపు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పిజి, బిఇడి, బిఎల్‌ఐఎస్‌సి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Read also: Hyderabad Crime: మరో మహిళతో భర్త.. ఫేస్‌బుక్‌ లో లైవ్‌ పెట్టి భార్య ఆత్మహత్య

గరిష్ట వయో పరిమితి: 1 జూలై 2023 నాటికి 60 ఏళ్లు మించకూడదు. ఎలాంటి వ్రాత పరీక్ష నిర్వహించకుండా అకడమిక్ మెరిట్, అనుభవం మరియు డెమో ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీటీలకు రూ.35,750, టీజీటీలకు రూ.34125, లైబ్రేరియన్లకు రూ.30,000 నెలవారీ వేతనం చెల్లిస్తారు.
Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!