Site icon NTV Telugu

TS TET : సెప్టెంబర్ లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..?

Whatsapp Image 2023 07 16 At 11.18.43 Pm

Whatsapp Image 2023 07 16 At 11.18.43 Pm

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. .అయితే డీఎస్పీపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. గతేడాది విద్యాశాఖ టెట్ పరీక్షను నిర్వహించింది.ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తుందని నిరుద్యోగులు అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటన మాత్రం జారీ కాలేదు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి ఏడాది పూర్తి అయిపోయింది.. ఈ నేపథ్యంలో తాాజాగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహించేందుకు రెడీ అవుతుంది.. ఇందుకు తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం కూడా ఆమోదముద్ర వేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

టెట్ పరీక్ష నిర్వహణకు సుమారు వంద రోజులకు పైగా సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ మరియు ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు మొత్తం 80 రోజులు సమయం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడికి దాదాపు 20 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా కలిపి వంద రోజుల సమయం పడుతుందని వారు అంచనా వేశారు. గతేడాది మార్చి 24న టెట్ నోటిఫికేషన్‌ జారీ చేయగా పరీక్షను జూన్‌ 27న నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ మాసంలో టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారంకొత్తగాడీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు 20వేలకు పైగా నే ఉన్నారు. గత కొంతకాలంగా మరో టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను జరపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి నిర్వహించబోయే పరీక్షకు కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version