Site icon NTV Telugu

TSRTC Chairman Bajireddy: ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడతాను

Tsrtc Chairman Bajireddy

Tsrtc Chairman Bajireddy

TSRTC Chairman Bajireddy: ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నా అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వ్యవసాయం దండుగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని అన్నారు. ఆర్టీసీ దండుగా అన్నారు.. ఇకపై ఆర్టీసీ పండగే అవుతుందని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మెన్, ఎండీగా మమ్మల్ని పెట్టడంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తాడని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఆర్టీసీ పని కథం అని అన్నారు, కానీ మేము ఛాలెంజింగా తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆర్టీసీ విరజిల్లుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నా అంటూ ఛైర్మన్‌ బాజిరెడ్డి అన్నారు.

Read also: Jagga Reddy Counter to Sharmila: మూడు రాష్ట్రాలు చేయండి.. ముగ్గురూ పంచుకోండి

నేను వ్యక్తిని నమ్మితే పని సక్రమంగా చేస్తా అని అన్నారు. కొన్ని ఛాలెంజింగ్ సమస్యలతో పని చేస్తే ఫలితం అదే స్థాయిలో ఉంది అని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఇప్పుడు జీతాలు 11 శాతం పెరిగాయని తెలిపారు. ఇంకో డీఏ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో 97 డిపోల నష్టాల్లో ఉన్నాయి కానీ, ఇప్పుడు 20 డిపోల్లో లాభాల్లో దూసుకెళ్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిందని అన్నారు. అయిన మనం ఛాలెంజ్ గా తీసుకొని ఆర్టీసీని బ్రతికిస్తున్నామని తెలిపారు. బస్సులు ఖాళీ ఉండొద్దు, ఖాళీగా ఉన్న బస్సు నడవద్దని అన్నారు. ఉద్యోగుల సమస్యలు వినండి, ఉద్యోగుల పట్ల మర్యాదగా ఉండండని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.

Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Exit mobile version