Site icon NTV Telugu

TS ICET Notification : ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను చేసుకోవాలని సూచించింది. రూ. 250 లేట్ ఫీజుతో జులై 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చునని తెలిపింది. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆగ‌స్టు 4న ఐసెట్ ప్రాథ‌మిక కీ, ఆగ‌స్టు 22న తుది ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామని వెల్లడించింది.

ఇది వరకే టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ.800 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.800, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్నారు.

Exit mobile version