మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో నామమాత్రంగానే జరిగింది.. దీనికి వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణంగా ప్రకటించింది సర్కార్.. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలో ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇకపై అర్హత ఉన్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. మరోవైపు.. వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్ ఆస్పత్రులతో అనుసంధానం కావాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.. 18 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించిన ఆయన.. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహించవచ్చని తెలిపారు.
తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి..
vaccinate