Telangana: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు వాపస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో డ్వాక్రా మహిళలకు త్వరలోనే అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం… కొద్ది రోజుల్లోనే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో సమావేశమైన మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ.545 కోట్ల రూపాయలను పొదుపు చేసుకున్నారు.
Read Also: IPL: ఆర్సీబీకి కొత్త కెప్టెన్… వెల్లడించిన కోహ్లీ
Also Read
- CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
- CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
- Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
- Hyderabad : పండుగ వేళ 'తీపి' విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఈ పొదుపు జరిగింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి రూపాయలు, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తోంది.. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నందున మహిళలు సైతం అభయ హస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. ఇక, పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్.. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి. త్వరలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు.
తాజావార్తలు
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
-
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!