NTV Telugu Site icon

TS Entermediate Exam: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు

Inter Eaxams In Telangana 2024

Inter Eaxams In Telangana 2024

TS Entermediate Exam: ఇంటర్‌ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు దశల్లో ప్రాక్టికల్స్‌, పర్యావరణ విద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇక వార్షిక పరీక్షలు మార్చి 28 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 58 కళాశాలల్లో 16 ప్రభుత్వ కళాశాలలు కాగా, 18 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి కస్తూర్బా, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ కళాశాలలు.

ఇందులో 13,175 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,507 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,668 మంది ఉన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ రంగ మోడల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలతో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించారు.

Read also: Congress Schemes: గుడ్‌ న్యూస్‌.. నేటి నుంచే విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం

ఈ పరీక్షల కోసం దాదాపు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాలను విడుదల చేస్తారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీమ్‌లు, 5 కస్టోడియన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని పోలీసు శాఖ ఆదేశించింది. పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

హాల్ టిక్కెట్లను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే అనుమతిస్తున్నారు. ఎక్కువ సమయం అనుమతించబడదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారలు తెలిపారు.
CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ సర్కార్‌ సదస్సులు.. మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు..?