NTV Telugu Site icon

TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్.. 11 గంటలకు పలితాలు విడుదల..

Ts Eamcet Results

Ts Eamcet Results

TS Eamcet Results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (TS EAPCET) 2024 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. జెఎన్‌టియుహెచ్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఆప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా అధికారులు ప్రకటించనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు. ఫలితాలు http://eapcet.tsche.ac.inలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది మే 7, 8 తేదీల్లో జరిగిన TS EAPCET పరీక్షకు మొత్తం 1,00,449 మంది అభ్యర్థులు హాజరు కాగా, మే 9 నుంచి 11 వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే.. ఈ TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ ఇప్పటికే విడుదలైంది. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తయింది. వీటి ఆధారంగా ఫైనల్ ఆన్సర్ కీని రూపొందించి ఫలితాలు విడుదల చేస్తారు.

Read also: Serial Actor Chandu : నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప షాకింగ్ వ్యాఖ్యలు..

అయితే.. ఈ ఏడాది TS EAMCET 2024 పరీక్షకు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు TS EAMCET 2024 ఫలితాల వివరాలను https://eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో EAPSET పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం (మే-16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షకు 90.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు తొమ్మిది దశల్లో నిర్వహించనున్నారు.
IPL 2024: ఇక మా మామ టీమ్‌కు వెళ్తున్నా: కేఎల్ రాహుల్