కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే, మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. మరోవైపు.. వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు.. తాజాగా, మరోసారి తెలంగాణ ఎంసెట్-2021 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు.. లేట్ ఫీజు లేకుండా ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.. కాగా, ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చాయి.. అందులో ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,46,541, ఫార్మాకు 73,486 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన వెల్లడించారు.
ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

TS EAMCET