TS DSC Notification: పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో ఇవాల కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. కాగా.. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది.
Read also: Telangana Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు.. సాధారణంగా కంటే మూడు డిగ్రీల అధికం
వాస్తవానికి ఫిబ్రవరి 28న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్‌వేర్ డిజైన్ తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో వాయిదా పడింది. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాటితోపాటు కొత్త పోస్టులను కూడా చేర్చి డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఇప్పటికే 4 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వారంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల నుంచి ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే సాఫ్ట్ వేర్ రూపకల్పనపై మరింత శ్రద్ధ పెట్టారు. పాస్‌వర్డ్‌లు మరియు ఆన్‌లైన్ సిస్టమ్ భద్రతను సీనియర్ అధికారులు సమీక్షిస్తారు. సాంకేతిక రంగంలో ప్రయివేటు కంపెనీల పాత్ర పోషిస్తున్నందున విద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కీలక పాత్ర పోషిస్తున్న అధికారులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?