Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ts Cabinet Sub Commete Meeting At Mcrhrd

రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదన

Published Date :June 29, 2021 , 6:02 pm
By Lakshmi Narayana
రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదన
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర అ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాల పైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తున్నదని, దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా, గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఏలాంటి పెంపు చేయలేదు.

ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇదే చట్టం ఆధారంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఏడుసార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 11 శాతానికి పెంచిన విషయము ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. పక్కనే ఉన్న తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతం గా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • lands
  • registrations
  • telangana

తాజావార్తలు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

  • PM Modi: గల్ఫ్‌లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ

  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..

  • Rupee vs Dollar: రూపాయి ఢమాల్.. భారత రూపాయి చరిత్రలో తొలిసారి 94 దాటింది!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions