Site icon NTV Telugu

Against GST: జీఎస్టీపై టీఆర్‌ఎస్‌ నిరసన.. పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపు

Against Gst

Against Gst

కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై టీఆర్‌ఎస్‌ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే.. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నరసన బాటపట్టింది. అయితే.. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈనేపథ్యంలో.. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు.. పాల ఉత్పత్తులపై పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరించాలని పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా రావలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Nine Year Old Girl Died Suspiciously: పాల కోసం వెళ్లి శవంగా మారిన చిన్నారి.. అసలేం జరిగింది..?

Exit mobile version