NTV Telugu Site icon

Sunitha Mahender Reddy: జెడ్పి ఛైర్ పర్సన్ వాహనంపై ఎమ్మెల్యే అనుచ‌రుల‌ దాడి

Sunitha Mahender Reddy

Sunitha Mahender Reddy

వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయాలు వేడెక్కాయి. జెడ్పి ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే ఆనంద్ అనుచ‌రుల‌ దాడి హాట్ టాపిక్ మారింది. అయితే.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పై తీవ్ర ఆరోపణలు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పై ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఆనంద్ అందరిని కలుపుకొని పోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుండంపై ఆమె మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి అన్నారు. ప్రోటోకాల్ ఎలా పాటించాలో మాకు తెలియదా..? మాకు ప్రజల మద్దతు ఉంది. ఆనంద్ వ్యవహార శైలితో కార్యకర్తలందరూ అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా త‌న చెప్పుచేతల్లో ఉండే రియలెస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నాడని మండిప‌డ్డారు.

read also: Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలి

గతంలో తన పేరు పక్కన తాను చదివిన డిగ్రీలు లేవని, శీలాఫలకాలను పగులగొట్టి ఉంచిన ఘణత ఆనంద్ కుందని ఆమో ఆరోపించారు. ప్రతి చిన్న విషయాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లొద్ద‌నే ఇన్నాళ్లు చెప్పలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాన‌ని మండిప‌డ్డారు. త్వరలోనే ఆనంద్ ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారని సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జెడ్పి ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి వాహనం పై దాడి చేసిన‌వారిపై క‌ఠిచ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న కారు అద్దాలు ద్వంసం చేసార‌ని, ఖ‌చ్చితంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులే ఈ దాడికి పాల్ప‌డ్డార‌ని సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

Jagadish Reddy: విద్యుత్ సరఫరాకు ఆటంకం వుండ‌దు