Site icon NTV Telugu

హుజురాబాద్‌ ప్రజలకు ఉన్న సోయి నాయకులకు లేదు: ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శల దాడికి దిగారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్‌ ప్రజలకు ఉన్న సోయి రాజకీయ నాయకులకు లేకుండా పోయిందన్నారు. ప్రగతి భవన్‌కు కేసీఆర్‌ మముల్ని రానియలేదు…. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ ఉద్యమం కరీంనగర్ నుండే పుడుతుందని ఈటల అన్నారు. రైతుబంధుఉన్నోళ్లకు ఇవ్వొద్దని అన్న… డబ్బులు చెట్లకు కాయవు. రైతు కూలీలకు, జీతగాళ్ళకు భీమా ఎందుకు లేదు.. కేసీఆర్‌కు ఈటలకు రైతు భీమా రావొచ్చా.. కౌలు రైతులకు, కూలీలకు వద్దా ..? అంటూ ప్రశ్నించారు. నన్ను పార్టీలో అవమానించారు. నాకు స్టార్‌ క్యాంపెయినర్‌గా అవకాశం ఇవ్వలేదు. ఉద్యమ కారుల రక్తాన్ని కళ్ల చూసిన వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనకు 2018లో డబ్బులిచ్చి నన్ను ఓడించాలని చూశారు. ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ సీఎంగా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

Also Read: కేంద్ర మంత్రిపై రాహుల్‌ నిప్పులు.. అజయ్‌ మిశ్రా ఓ క్రిమినల్‌..!

నేను పార్టీ నుండి బయటకు రాలేదు… వాళ్లే నన్ను పంపించారు. ఇజ్జత్‌ ఉన్నవాడిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజూరాబాద్‌లో నా ఒక్కడిని ఓడించడం కోసం రూ.600 కోట్ల నల్లధనం ఖర్చు చేశారు. దళితుల మీద ప్రేమతో దళిత బంధు కాదు వాళ్ల ఓట్ల మీద ఆశతో పథకాన్ని తెచ్చారన్నారు.తన మనవడు, ముని మనవడు వరకు సీఎం కావాలంటే తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఈటల ఆరోపించారు. సంఘాలను చంపేశాడు.. వరి విషయంలో సీఎం రకరకాల మాటలు చెప్పారు. వరి వేస్తే రైతు బంధు రాదని అంటున్నారు. సీఎంకు రైతుల మీద ప్రేమ లేదు… ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో కేసీఆర్‌పై మండిపడ్డారు ఈటల.

Exit mobile version