Site icon NTV Telugu

బీజేపీ చేసేది ప్రజా సంకట యాత్ర…

తెలంగాణ బీజేపీ అశ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ… బీజేపీ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు- ప్రజా సంకట యాత్ర అన్నారు. తెలంగాణ సాదించుకుంది కుక్కలు- నక్కలలాంటి వ్యక్తులతో తిట్టిపించుకోవడానికా అని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలో కాదు- మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో చెయ్యాలి. బీజేపీ కి అధికారం కావాలంటే ఆ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన మంచి చెబుతూ పాదయాత్ర చేయాలి. కేసీఆర్- ఆయన కుటుంబాన్ని పల్లెత్తు మాట అంటే నాలుక తెగ్గోస్తాం. ఒక చిల్లరగాడు ఎంపీ అయితే ఎంత దరిద్రంగా ఉంటాదో దానికి నిదర్శనం బండి సంజయ్ అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్.

Exit mobile version