NTV Telugu Site icon

Patnam Mahender Reddy: సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ బూతు పురాణం..

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy

వికారాబాద్‌ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి చెందగా.. కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన పైలట్‌ రోహిత్‌ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం కేసీఆర్‌.. అయితే, పలు సందర్భాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి.. మరోవైపు.. ఈ ఇద్దరు నేతల మధ్య అధికారులు కూడా నలిగిపోతున్నట్టు తెలుస్తోంది.. తాజాగా, తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి…

Read Also: Janasena: సీబీఐ దత్తపుత్రుడిది పాలనా..? వడ్డీ వ్యాపారమా..?

తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు… ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? రా లం… కొడకా..! నీ అంతు చూస్తా..! అని వార్నింగ్‌ ఇచ్చారు. పద్ధతిగా మాట్లాడాలని సీఐ వారిస్తుంటే.. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు.. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఇప్పుడా ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.