NTV Telugu Site icon

షర్మిల దీక్షకు స్పందనే లేదు.. మీ రాజ్యం వచ్చేది లేదు..!

Sandra Venkata Veeraiah

Sandra Venkata Veeraiah

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్‌ చేస్తుందన్న సండ్ర.. ఆత్మహత్యల ద్వారా నిరుద్యోగం పరిష్కారం కాదన్నారు.. రాజకీయ పార్టీలు రెచ్చ గొట్టవద్దు.. ప్రజలను రెచ్చ గొట్టడం ద్వారా సమాజానికి ఏమి చెప్పాలను కుంటున్నారని అని ఫైర్ అయ్యారు. జనం లేని సభ కోసం షర్మిల లక్షలు ఖర్చు చేశారని విమర్శించిన ఆయన.. ఆమె దీక్షకు స్పందనేలేదు.. తెలంగాణలో మీ రాజ్యం వచ్చేది లేదు.. మీ పార్టీ నిలబడేది లేదని వ్యాఖ్యానించారు.