Rega Kantha rao: నేను ఫైటర్ని, కత్తి తిప్పడం, తుపాకీ పేల్చడం కూడా వచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు కొన్నిసార్లు తారాస్థాయికి చేరుతున్నాయి.. సొంత పార్టీ నేతలపైనే బహిరంగ వేదికలపై బాహాటంగా మాట్లాడేస్తున్నారు నేతలు.. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు హాట్ కామెంట్లు చేశారు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుళ్లూరు బ్రహ్మయ్యలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. రేగ కాంతారావు అనే వాడు ఉంటే వాళ్ల ఆటలు సాగవనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, నా పదేళ్ల వయసులోనే నేను కత్తులతో ఆడుకున్నానని.. స్వతహాగా నేను ఫైటర్ని, నాకు కత్తి తిప్పడం వచ్చు, తుపాకీ పేల్చడం కూడా వచ్చు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు భద్రాద్రిలో చర్చగా మారాయి. అయితే, రాజకీయాలు అంటే ఇవి కావు అని హితవు పలికారు కాంతారావు.. వాళ్ల దుకాణం బందు అవుతుందనే భయంతోనే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. మొన్న మల్లేల మడుగు, నిన్న ఆశ్వపురం ఘటనలే దీనికి నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. యాభై కార్లలో వచ్చి వెళ్లేవారితో ఏమైనా ప్రయోజనం ఉందా..? అంటూ నిలదీశారు.. నన్ను గిరిజన వ్యక్తిగా ముద్ర వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నేను అందరి వాడిని అని స్పష్టం చేశారు..
Read Also: Rajya Sabha: పెద్దల సభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..
Also Read
తాజావార్తలు
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!