Site icon NTV Telugu

కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ…

కాంగ్రెస్ ,బీజేపీ చీకటి ఒప్పందం లో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగింది. ఆ రెండు పార్టీ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరం లో లేదు అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పగటి దొంగ రేవంత్ కు తగిన శాస్తి లభిస్తుంది. దళిత ,గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమి లేదు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతం లో గిరిజన ,ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే ఇపుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగింది. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని… దళిత ,గిరిజన ,ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు.

Exit mobile version