సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గాదరి మారయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీఈటీ మాస్టర్‌గా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్గొండ మండలం నర్సింగ్‌భట్. ప్రస్తుతం నల్గొండ పట్టణంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న మారయ్యకు శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
Read Also: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మారయ్య మరణవార్త తెలుసుకున్న కేసీఆర్.. గాదరి కిషోర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు మారయ్య మృతి పట్ల మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ నేత చకిలం అనిల్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మారయ్య అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం నల్గొండ పట్టణంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
